Waltair Veerayya Villian : మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రంగా ‘వాల్తేరు వీరయ్య’ ప్రేక్షకుల ముందుకు 2023 సంక్రాంతికి రానుంది. మరో నెలరోజుల్లో ‘వాల్తేరు వీరయ్య’ అభిమాలను ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమాపై స్టోరీకి సంబంధించిన రకరకాల ఊహగానాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ సినిమాలో ఒక్క పాత్రపై ఇప్పటి వరకు క్లారిటీ రావడం లేదు.
‘వాల్తేరు వీరయ్య’ మూవీలో మాస్ మహారాజ్ రవితేజ కీలక పాత్రలో నటిస్తుండగా చిరుకు జోడిగా కమల్ హాసన్ ముద్దుల తనయ శృతిహాసన్ నటిస్తోంది. ఫుల్ అండ్ మాస్ ఎంటటైనర్ గా ‘వాల్తేరు వీరయ్య’ను దర్శకుడు బాబీ అద్భుతంగా తెరకెక్కిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజ్ అప్డేట్ లీకైంది.
చిరంజీవి ఈమూవీలో డ్యూయల్ రోల్ చేస్తున్నారని.. అందులో ఒకటి అండర్ కవర్ కాప్ పాత్ర అని టాక్ విన్పిస్తోంది. వైజాగ్ సిటీలోని మాస్ ఏరియా వాల్తేరులో జరుగుతున్న భయంకరమైన క్రైమ్ ను ఆపేందుకు ‘వీరయ్య’ అండర్ కవర్ పోలీస్ గా మెగాస్టార్ కన్పించబోతున్నారని లీకులు అందుతున్నాయి.
అంతేకాకుండా ప్రభాస్ నటించిన ఛత్రపత్రి తరహాలో ‘వాల్తేరు వీరయ్య’ మూవీలో శ్రీలంక బ్యాక్ డ్రాప్ ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ మూవీ టీజర్ ను పరిశిలిస్తే ఈ మూవీలో ఇద్దరు.. ముగ్గురు విలన్లు ఉంటారనే హింట్ దర్శకుడు బాబీ ఇచ్చారు. బాబి సింహా ఇతర విలన్లు టీజర్ లో చూపించిన అసలు విలన్ పాత్రధారి ఎవరనేది మాత్రం సస్పెన్స్ గానే మారింది.
వాల్తేరు వీరయ్యను ఢీకొట్టి మొనగాడు ఎవరా? అన్న చర్చ అభిమానుల్లో జోరుగా నడుస్తోంది. చిరంజీవికి ధీటుగా విలన్ పాత్ర ఉంటేనే సినిమా అనుకున్నంత స్థాయిలో హిట్ అవుతుందని.. రోటిన్ విలన్ అయితే ఆ ప్రభావం సినిమాపై ఖచ్చితంగా ఉంటుందనే టాక్ విన్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే వాల్తేరు వీరయ్యలో విలన్ ఎవరా? అని తెలుసుకునేందుకు మెగా అభిమానులు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు.
దర్శకుడు బాబీ మాత్రం ఇప్పటి వరకు ‘వాల్తేరు వీరయ్య’లో ప్రధాన విలన్ ను చూపించకుండా సస్పెన్స్ ను మెయింటెన్స్ చేస్తున్నారు. అయితే వాల్తేరు వీరయ్య ట్రైలర్లో ఈ సస్పెన్స్ కు దర్శకుడు బాబీ ఎండ్ కార్డు వేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. వాల్తేరు వీరయ్య ట్రైలర్ వరకు అభిమానులు ఒపిక పట్టాల్సిందేననే టాక్ విన్పిస్తోంది.
వాల్తేరు వీరయ్య మూవీ నుంచి విడుదలైన ‘బాస్ పార్టీ’ సాంగ్ యూట్యూబ్ లో సన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మిలియన్లలో వ్యూస్ రాబడుతూ ట్రెండ్ లో దూసుకెళుతోంది. ‘బాసు వేర్ ఈజ్ ద పార్టీ.. బాసు వేర్ ఈజ్ ద పార్టీ’ ఊర్వశి రౌతలా ముద్దుముద్దుగా అడగటం.. దానికి బాసు అదిరిపోయే స్టెప్పులు వేయడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పాటతో దేవీశ్రీ మరోసారి మాస్ పల్స్ టచ్ చేశాడు.
మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’తోపాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘బోళా శంకర్’ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో చిరుకు జోడిగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుంది. చిరుకు సోదరి పాత్రలో మహానటి కీర్తి సురేష్ నటిస్తుండటం విశేషం. ఈ సంక్రాంతి బరిలో ‘వాల్తేరు వీరయ్య’కు పోటీగా నందమూరి నటసింహం నటిస్తున్న ‘వీరసింహారెడ్డి’ రాబోతుంది.
‘బాలయ్య’ వీరసింహారెడ్డిని కూడా మైత్రీ మూవీ మేకర్సే నిర్మిస్తుండగా ఈ రెండు చిత్రాలు కూడా ఒకటి రెండ్రోజుల గ్యాప్ తో వచ్చే అవకాశం కన్పిస్తోంది. ఈ మూవీని ఇటీవలే ‘జై బాలయ్య మాస్ అంథమ్’ సాంగ్ విడుదలై నందమూరి ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.
బాలయ్యకు జోడిగా శృతిహాసన్ నటిస్తుండగా ప్రధాన విలన్ పాత్రలో కన్నడ నటుడు విజయ్ ధునియా కన్పించబోతున్నాడు. ‘అఖండ’తో బాలకృష్ణ సాలీడ్ హిట్టు అందుకోగా మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ ఇద్దరు రెట్టింపు ఉత్సాహంతో తమ తదుపరి సినిమాలను విడుదల చేస్తున్నారు. దీంతో 2023 సంక్రాంతి పందెం కోడి ఎవరా? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
Read more : Veera Simha Reddy Jai Balayya Mass Anthem Song
Keywords: Waltair Veerayya song | Waltair Veerayya story | Waltair Veerayya 2022 | Waltair Veerayya Item Song | Waltair Veerayya Heroine | Waltair Veerayya Villan | Waltair Veerayya Movie Release date | Waltair Veeraya Songs Download.
Read more : Boss Party Song Lyrics Waltair Veerayya
Post a Comment