Ira Khan-Nupur Marriage : రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న ఐరా ఖాన్

Ameer khan Daughter Ira Khan-Nupur Marriage Photos Goes Viral : రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న ఆమిర్‌ ఖాన్‌ కుమార్తె ఐరా.. గ్రాండ్ పార్టీ ఎప్పుడంటే..!


Ira Khan-Nupur Marriage

బాలీవుడ్ వెటరన్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ (Ira Khan) తన ప్రియుడైన నుపూర్  శిఖరే (Nupur Shikhare) ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

ఆమిర్ ఖాన్ కూతురు ఐరా వివాహం చాలా సింపుల్ గా జరగడం విశేషం. ముంబైలోని ఓ హోటల్ ఈ వివాహతంతు జరిగింది. ఐరా ఖాన్-నపుర్ రిజిస్టర్ మ్యారేజ్ నూతన వివాహబంధంలోకి అడుగుపెట్టారు. 

ఈ వేడుకకు ఆమిర్ ఖాన్ తోపాటు ఆయన మాజీ భార్యలు రీనా దత్త (Reena Dutta), కిరణ్ రావు (Kiran Rao) లు హాజరయ్యారు. రియలన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీలతోపాటు పలువురు ప్రముఖులు ఈ వివాహ వేడుకలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. 

Ira Khan-Nupur Marriage Photos Viral

  • జాగింగ్ డ్రెస్సులోనే వివాహం..!

ఐరా ఖాన్ తో పెళ్లికి ముందు నుపుర్‌ తన నివాసం నుంచి జాగింగ్‌ చేసుకుంటూ హోటల్‌కి చేరుకోవడం గమనార్హం. జాగింగ్‌ దుస్తుల్లోనే నపుర్ ఐరా ఖాన్ ను వివాహం చేసుకొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. వివాహం అనంతరం అదే హోటల్ లో రిసెప్షన్ జరిగింది. 

కాగా ఐరా అమిర్ ఖాన్, రీనా దత్త కూతురుగా అందరికీ సుపరిచితమయ్యారు. అంతేకాకుండా ఆమె ‘మెంటల్ హెల్త్ సపోర్ట్ ఆర్గనైజేషన్’ సంస్థ వ్యవస్థాపకురాలిగా, సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ఆమె తరుచూ మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. ఆమె వద్ద నుపుర్ వ్యక్తిగత ఫిట్ నెస్ ట్రైనర్ గా కొనసాగుతున్నారు. 

అతడి వద్దే ఐరా ఫిట్ నెస్ పాఠాలు నేర్చుకుంటోంది. ఈ సమయంలోనే వీరిమధ్య ప్రేమ చిగురించింది. గత కొన్నాళ్లుగా వీరిద్దరు డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. వాటన్నింటిని నిజం చేస్తూ ఐరా-నపుర్ లు పెళ్లి చేసుకొని దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు. 

Ira Khan-Nupur Wedding

  • ఉదయ్ పూర్ లో మరోసారి పెళ్లి..

ఇకపోతే జనవరి 8న రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో ఐరా-నపుర్ మరోసారి వివాహం చేసుకోనున్నారు. ఈనెల 13న ముంబయిలో వీరి వివాహ విందు కార్యక్రమం జరుగనుందని సమాచారం. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు సైతం పూర్తయ్యాయి. దీంతో బాలీవుడ్లో పండుగ వాతావరణం నెలకొంది. 



Keywords : Ira Khan-Nupur Marriage, Ira Khan-Nupur Marriage Pics, Ira Khan-Nupur Marriage Photos, Ira Khan-Nupur Marriage Images, Ira Khan Marriage photos, Ira Khan Marriage, Ameer Khan Daughter Marriage, Ira Khan-Nupur Wedding, Ira Khan-Nupur Wedding Photos, Udaipur, Mumbai Hotel, Anil Ambani and Neetha Ambani.

Read more : Student Web Series New Episodes

Post a Comment