Gopi Chand VISWAM Movie : హీరో గోపిచంద్ మలినేని తనకు అచ్చివచ్చిన యాక్షన్ కథాంశంతోనే మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దర్శకుడు శ్రీనువైట్ల కామెడీ మరియు గోపిచంద్ యాక్షన్ ను మిక్స్ చేస్తూ ‘విశ్వం’ మూవీని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
రెండు నిమిషాల 36 సెకన్ల నిడివితో విడుదలైన విశ్వం ట్రైలర్ (VISWAM Trailer) యాక్షన్ చిత్రాలు చూసే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవడం ఖాయంగా కన్పిస్తోంది. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా కామెడీ అంశాలను సైతం దర్శకుడు శ్రీను వైట్ల పొందుపర్చాడు.
గోపిచంద్.. శ్రీనువైట్ల మార్క్..
ట్రైలర్లో వచ్చే డైలాగ్స్ కూడా యాక్షన్ ప్రియులను ఆకట్టుకునే ఉన్నాయి. బ్యాక్ మ్యూజిక్ సైతం ఆకట్టుకుంది. గోపిచంద్ యాక్షన్, వెన్నల కిషోర్ కామెడీ.. కావ్యా థాపర్ అందచందాలు సినిమాకు హైలెట్ అయ్యేలా కన్పిస్తున్నాయి. అదేవిధంగా సీనియర్ నటుడు నరేష్, ప్రగతి, సునీల్, రాహుల్ రామకృష్ణ, థర్టీ ఇండస్ట్రీ పృథ్వీ తదితరులు కామెడీ సీన్స్ టీజర్లో ఆకట్టుకున్నాయి.
టైలర్ మొత్తంగా పరిశీలిస్తే ఇదొక యాక్షన్ కామెడీ సినిమా రాబోతుందని అర్థమవుతోంది. డైరెక్టర్ శ్రీనువైట్ల, గోపిచంద్ మార్క్ ‘విశ్వం’ సినిమాలో కన్పించింది. ఈ మూవీని అక్టోబర్ 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు మూవీ ప్రకటించారు. దీంతో మూవీ ప్రమోషన్స్ సైతం ఊపకుందుకున్నాయి. మరీ ఈ సినిమా డైరెక్టర్ శ్రీను వైట్ల మరియు గోపిచంద్ మలినేనిలకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందోనని ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
విశ్వం ట్రైలర్ వీడియో (Gopichand VISWAM Trailer Video ) :
Read more :
- Gunguru Gunguru - Lyrical Song | Viswam | Gopichand, Kavya Thapar
Post a Comment