మట్కా టీజర్ రివ్యూ.. ‘మనకి ఏదీ అవసరమో అదే ధర్మం’..

Matka Teaser Review and Dialogues : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజా చిత్రం మట్కా. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ తాజాగా రిలీజైంది. 100 సెకన్ల నిడివితో విడుదలైన మట్కా టీజర్ ఆద్యంతం అభిమానులను ఆకట్టుకుంటోంది. టీజర్ ను పరిశీలిస్తే మంచి హైవోల్టేజ్ యాక్షన్ మూవీగా అర్థమవుతోంది. టీజర్లో వరుణ్ తేజ్ లుక్.. ఫార్మామెన్స్ చూస్తుంటే మెగా ఫ్యాన్స్ కు పునకాలు రావడం ఖాయంగా కన్పిస్తోంది. 

Matka Teaser Review

మట్కా టీజర్ డైలాగ్స్ (Matka Teaser Dialogues) : 

‘‘ఈ దేశంలో తయారయ్యే ప్రతీ రూపాయిలో 90పైసలు ఒక్కడే సంపాదిస్తాడు.. మిగతా 10పైసల గురించి 99మంది కొట్టుకుంటారు నాలాంటోళ్లు.. నువ్వు ఆ తొంబై పైసలు సంపాదించే ఒక్కడివి.. 99మందిలో ఒకటిగా మిగిలిపోకు.. నీకా దుమ్ముంది..’’

‘‘విశాఖపట్టణం అంటే ఒకటి సముద్రం గుర్తుకు రావాలి.. లేదా ఈ వాసు గుర్తుకు రావాలి..’’


‘‘ధర్మం.. మనకి ఏది అవసరమో అదే ధర్మం.. మనిషిలో ఆశ సవానంత వరకు నా య్యాపారానికి సావుండదు..’’

Matka Teaser Review and Dialogues

మట్కా టీజర్ చూస్తుంటే.. వరుణ్ తేజ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడటం ఖాయంగా కన్పిస్తోంది. కేజీఎఫ్ తరహా కథాంశంతోనే ‘మట్కా’ మూవీ తెరకెక్కినట్లు టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. అదే నిజమైతే మాత్రం వరుణ్ తేజ్ ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్ కావడం ఖాయం. 

ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో 2024 నవంబర్ 14న విడుదల కానుంది. ఈ మూవీలో వరుణ్ తేజ్ సరసన మీనాక్షి చౌదరి, నోరాఫతేహి నటిస్తున్నారు. నవీన్ చంద్ర, కన్నడ కిషోర్, అజయ్ ఘోష్, మైమ్ గోపి, రూపలక్ష్మి, విజయరామరాజు, జగదీష్, రాజ్ తిరందాస్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 

మట్కా మూవీకి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరిలు వైరా ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

Varun Tej Matka  Movie Teaser Video :


Read more : Telugu Medium Webseries New Episodes

Pragya Nayan

  • Le Le Raja Lyrical Video | MATKA | Varun Tej | Nora Fatehi | Karuna Kumar 

  • Thassadiyya Lyrical Song From Matka | Varun Tej Matka Songs

Post a Comment