Akhanda-2 Thaandavam Heroine : నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో సినిమా వస్తుందంటే అభిమానులకు పండుగే. వీరిద్దరి కాంబోలో గతంలో తెరకెక్కిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించారు.
సింహా.. లెజెండ్.. అఖండ సినిమాలన్నీ నందమూరి ఫ్యాన్స్ కు పునకాలు తెప్పించాయి. వీరిద్దరి కాంబో హట్రిక్ హిట్టుగా నిలిచిన సంగతి తెల్సిందే. చివరిగా వీరిద్దరి కాంబినేషన్లో ‘అఖండ’ సినిమా విడుదలై బాక్సాఫీసును షేక్ చేసింది.
ఈ సినిమాకు సిక్వెల్ గా ‘అఖండ-2 తాండవం’ రానుందని మేకర్స్ గతంలోనే ప్రకటించారు. ఈ మూవీ షూటింగు హైదరాబాద్లో శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ బిగ్ అప్డేట్ ను మేకర్స్ ప్రకటించారు. ‘అఖండ-2’ హీరోయిన్ కు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు.
అఖండ-2లో (Akhanda-2 Thaandavam Heroine) బాలయ్యకు జోడిగా సంయుక్త మీనన్
అఖండ-2 తాండవంలో బాలకృష్ణకు జోడిగా సంయుక్త మీనన్ నటించనుందని ప్రకటించారు. ఈమేరకు వీరిద్దరి సంబంధించిన సీన్స్ ను హైదరాబాద్లో దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాలో సంయుక్త మీనన్ నటిస్తున్నట్లు కన్ఫామ్ అయింది.
‘అఖండ’ మొదటి పార్ట్ లో బాలకృష్ణకు జోడిగా ప్రగ్యా జైస్వాల్ నటించింది. దీంతో అఖండ-2లో సైతం ఆమెనే హీరోయిన్ గా ఉంటుందని అంతా భావించారు. అయితే తాజాగా సంయుక్త మీనన్.. బాలకృష్ణకు జోడిగా ఎంపిక కావడంతో రెండో పార్ట్ లో ప్రగ్యా జైస్వాల్ ఉంటుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారా? లేదంటే సంయుక్త మీనన్ తోపాటు మరో హీరోయిన్ ను సైతం ఎంపిక చేస్తారనేది అనేది చూడాలి. కాగా సంయుక్త మీనన్ తెలుగు గోల్డెన్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.
గతంలో కల్యాణ్ రామ్ తో ‘బింబిసార’లో సంయుక్త మీనన్ నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘విరూపాక్ష’లో నటించింది. ఈ సినిమా సైతం సంయుక్త కెరీర్లో హిట్టుగా నిలిచింది.
ఏదిఏమైనా ‘అఖండ-2’లో బాలయ్యకు జోడిగా యంగ్ హీరోయిన్ సంయుక్త మీనన్ నటిస్తుండటంతో నందమూరి ఫ్యాన్స్ సైతం ఖుషీ అవుతున్నారు. కాగా ‘అఖండ 2 తాండవం’ దసరాగా కానుకగా సెప్టెంబర్ 25న రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
Read more : Actress Kushitha Kallapu Biography
Post a Comment