Vaishnavi Chaitanya : 'బేబీ' సినిమాతో వైష్ణవి చైతన్య వెండితెరకు పరిచయమైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడంతో ఓవర్ నైట్లో పాపులర్ గా మారిపోయింది.
![]() |
| Vaishnavi Chaitanya |
సినిమాల్లో రాకముందు 'సాఫ్ట్ వేర్ డెవలపర్ (Software Developer) ' అనే వెబ్ సిరీస్ తో వైష్ణవి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఆనంద్ దేవరకొండ తో కలిసి వైష్ణవి నటించిన 'బేబీ' సూపర్ డూపర్ హిట్ కావడంతో వైష్ణవికి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. అయితే ఏది పడితే అది మాత్రం ఒప్పుకోవడం లేదు.
వైష్ణవి చైతన్య ప్రస్తుతం 'డీజే టిల్లు (DJ Tillu)' ఫేం సిద్ధు జొన్నలగడ్డతో కలిసి 'జాక్ (Jack Movie 2025) ' సినిమాలో నటిస్తోంది. వేసవిలో రానున్న 'జాక్'పై వైష్ణవి చాలా ఆశలు పెట్టుకుంది. ఈ మూవీని ఏప్రిల్ 10న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
![]() |
| Jack Movie Poster |
ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఫొటోషూట్లతో ఫుల్ బిజీగా ఉంటోంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్స్ పోస్టు చేస్తూ ఉంటుంది. కాగా ఈ భామ 'ఆస్క్ మి కశ్చన్' అనే గేమ్ లో భాగంగా తనని ఎవరైన ప్రశ్నలు అడగవచ్చు అంటూ వైష్ణవి చైతన్య పోస్ట్ పెట్టింది. ఇదికాస్తా నెట్టింట వైరల్ గా మారింది.
ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు తమకు నచ్చిన ప్రశ్నలు వేస్తూ జవాబులు తెలుసుకున్నారు. ఓ నెటిజన్.. 'స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) తో వర్క్ చేయడం ఎలా ఉందంటూ అడగాడు. దీనిపై వైష్ణవి స్పందిస్తూ..
‘‘అతడితో వర్క్ చేయడం చాలా గ్రేట్ గా భావిస్తున్నా.. సిద్ధూ.. వర్సటైల్ యాక్టర్.. అండ్ ఆల్ రౌండర్.. జోక్స్ కూడా బాగా చేస్తాడు.. మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది.. నిజంగా స్టార్ బాయ్ సిద్ధూనే’’ అంటూ రాసుకొచ్చింది ఈ బేబీ.
Read more : Anand Deverakonda, Vaishnavi Chaitanya New Movie


Post a Comment