Laapataa Ladies : జపాన్ అవార్డుకు షార్ట్ లిస్టయిన ‘లపతా లేడిస్’

Laapataa Ladies Shortlisted for Japan Award : ఇద్దరు నవ వధువులు రైలు ప్రయాణంలో అనుకోకుండా తారుమారైన సంఘటనను ఇతివృత్తంగా ‘లపతా లేడీస్’ సినిమాను తెరకెక్కించారు. 'ఇండియన్ ఫిల్మ్ ఫెస్టి వల్ ఆఫ్ మెల్బోర్న్ (ఐఎఫ్ఎఫ్ఎం)' అవార్డుల్లో క్రిటిక్స్ ఛాయిస్ విభాగంలో బెస్ట్ మూవీగా నిలిచింది. 

Laapataa Ladies

2025 ఆస్కార్ కు మనదేశం నుంచి ఎంపికైన ఈ చిత్రం షార్ట్ లిస్ట్ లో చోటు దక్కించుకోలేకపోయింది. ఈ సినిమా గత ఏడాది అక్టోబరులో జపాన్లో విడుదలైంది. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (టీఐఎఫ్ఎఫ్) వేడుకలో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు.

హలీవుడ్ మూవీలతో పోటీ పడుతున్న (Laapataa Ladies) ‘లపతా లేడిస్’..

పలు అంతర్జాతీయ అవార్డులు దక్కించుకున్న ‘లపతా లేడీస్’ ఈసారి జపాన్ అకాడమీ ఫిల్మ్ ప్రైజ్-2024 కు షార్ట్ లిస్టయింది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీ కింద 'ఓపెన్హైపర్'.. 'పూర్ థింగ్స్'.. 'ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్'.. 'సివిల్ వార్' వంటి హాలీవుడ్ సినిమాలకు ‘లపతా లేడీస్’ పోటీ పడుతోంది.  

2025 మార్చి 14న జరిగే వేడుకలో అవార్డులను ప్రకటించనున్నారు. నితాన్నీ గోయల్, ప్రతిభా రంతా, స్పర్మ్ శ్రీవాత్సవ ఛాయా కదమ్, రవి కిషన్ కీలక పాత్రల్లో నటించగా కిరణ్ రావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. 

కిరణ్ రావు, ఆమిర్ ఖాన్, జ్యోతి దేశ్‌పాండేలు నిర్మాతలుగా వ్యవహరించారు. ఇండియాలో ఈ మూవీ 2024 మార్చి 1న విడుదలైంది. ఈ సినిమాను హిందీలో తెరకెక్కించారు.

Read more : Actress Zeba Khan Latest Photo Gallery

Post a Comment