Anushka Shetty Ghaati : ‘ఘాటీ’ కోసం అనుష్కశెట్టి రియల్ స్టంట్స్

Anushka Shetty Ghaati Film | Cast | Crew | Release Date | Review and Rating | Anushka Shetty New Film Ghatti.

Anushka Shetty Ghaati
Anushka Shetty Ghaati

అనుష్క శెట్టి లేటెస్ట్ మూవీ 'ఘాటీ'. ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో తమిళ నటుడు విక్రమ్ ప్రభు నటిస్తున్నాడు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే అనుష్క ఫస్ట్ లుక్.. గ్లింప్స్ రిలీజ్ కాగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 


ఈ సినిమా ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో షూటింగ్ జోరు పెంచారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 


ఈ చిత్రంలో గంజాయి అక్రమ రవాణా హైలైట్ ఉంటుందని టాక్. ఇందుకు సంబంధించిన చిత్రీకరణ అడవుల్లో నిర్వహిస్తున్నారు. అడవుల నేపథ్యంలో సాగే యాక్షన్, ఛేజింగ్ సన్నివేశాల విషయంలో అనుష్క ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నటిస్తుందట.


  • అనుష్క శెట్టి (Anushka Shetty Ghaati Film) రియల్ స్టంట్స్..

రియల్ అడవి ప్రాంతాల్లో డూప్ లేకుండా రియల్ స్టంట్స్ తో అదరగొడుతుందట. ఈ సన్నివేశాలను డైరెక్టర్ క్రిష్ డూప్ తీసుకుందామంటే.. అనుష్క నో చెప్పిందట. అంతే కాకుండా తానే స్వయంగా చేస్తానంటూ ప్రత్యేక ట్రైనింగ్ కూడా తీసుకుందని టాక్. 


ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారుతుండటంతో అనుష్క 'ఘాటీ' కోసం ఎంతో కష్టపడుతుందని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. ఈ సినిమా తనకు మంచి కమ్ బ్యాక్ ఇవ్వాంటూ వారంతా కామెంట్స్ చేస్తున్నారు. 

  • Anushka Shetty GHAATI Glimpse | Queen Anushka Shetty

Pragya Nayan : ప్రగ్యా నయన్ అందాలకు ‘కుర్రకారు’ ఫిదా

Post a Comment