Krithi Shetty Tollywood Re Entry : తొలి సినిమాతోనే పాన్ ఇండియా స్థాయిలో స్టార్‌డమ్ సొంతం చేసుకున్న కృతి శెట్టి, టాలీవుడ్‌లో ఒకప్పుడు అందరి దృష్టిని ఆకర్షించిన ముద్దుగుమ్మ. 'ఉప్పెన' సినిమాతో ఓవర్ నైట్ స్టార్డమ్ సొంతం చేసుకుంది.
ఆ తర్వాత 'శ్యామ్ సింగరాయ్', 'బంగార్రాజు' వంటి చిత్రాల్లో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఆమెకు సరైన గుర్తింపును అందించ లేకపోయాయి. ప్రేక్షకులతో కనెక్ట్ కాకపోవడంతో ఆమెపై ఆసక్తి క్రమంగా తగ్గిపోయింది.
చివరగా వచ్చిన 'మనమే' చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద ఆమెను నిలబెట్టలేకపోయింది. దీంతో టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గడంతో కృతి తమిళ సినిమాల వైపు అడుగులు వేసింది.
ప్రస్తుతం కృతి శెట్టి కోలీవుడ్‌లో 'ఎల్.ఐ.కె', 'జినీ' వంటి సినిమాలతో బిజీగా ఉంది. ఈ రెండు చిత్రాలపై ఆమె భారీ ఆశలు పెట్టుకుంది. టాలీవుడ్‌లో మళ్లీ తన సత్తా చాటాలంటే, ఈ సినిమాల విజయం ఆమెకు కీలకం.
టాలీవుడ్ డైరెక్టర్లు ప్రస్తుతం కొత్త ముఖాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో, కృతి రీఎంట్రీ ఇవ్వాలంటే కంటెంట్ ఆధారిత సినిమా లేదా బలమైన పాత్రతో రాణించాల్సిందే. తమిళ చిత్రాల్లో ఆమె నటన ఆకట్టుకుంటే, టాలీవుడ్‌లో తిరిగి స్థానం సంపాదించడం పెద్ద కష్టం కాదు.
Read more : Hari Hara Veera Mallu Movie
గ్లామర్ షోకు రెడీ అంటున్న కృతి..
గతంలో గ్లామర్ విషయంలో కాస్త రిజర్వ్‌గా ఉండే కృతి, ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త లుక్‌తో ఫోటోషూట్‌లతో అభిమానులను ఆకర్షిస్తోంది. సినిమా అవకాశాలు తగ్గినా, తన ప్రెజెన్స్‌ను ట్రెండ్‌లో ఉంచేందుకు ప్రయత్నిస్తోంది.
కోలీవుడ్‌లో ఆమె చేస్తున్న ఈ కొత్త ప్రయత్నాలు కృతిశెట్టి కెరీర్‌ను మళ్లీ ఉన్నత స్థానానికి తీసుకెళ్తాయా? అనేది మాత్రం త్వరలోనే తెలుస్తుంది. మరోవైపు కృతి శెట్టి అభిమానులు మాత్రం మళ్లీ టాలీవుడ్‌లో ఆమె రాణించాలని కోరుకుంటున్నారు.
Post a Comment