Priyanka Chopra Ram Chahe Leela Song : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తన గత జ్ఞాపకాలను తాజా చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రామ్ లీలా’ చిత్రంలోని ఐకానిక్ సాంగ్ ‘రామ్ చాహే లీలా’ వీడియోను షేర్ చేస్తూ, ఆ సాంగ్‌కు సంబంధించిన తన అనుభవాలను వివరించారు.
ఈ సాంగ్ షూటింగ్ సమయంలో ఎదురైన సవాళ్లు, దర్శకుడి స్ఫూర్తి, కొరియోగ్రాఫర్ అద్భుతమైన రచనలను ప్రియాంక వివరించారు. ఈ పోస్ట్ ఆమె అభిమానులకు ఆ సాంగ్‌తో ముడిపడిన ఆసక్తికర విశేషాలను తెలియజేసింది.
ప్రియాంక చోప్రా తన పోస్ట్‌లో ‘రామ్ చాహే లీలా’ సాంగ్‌ను చేయడం తనకు పెద్ద సవాల్‌గా అనిపించిందని చెప్పారు. “సంజయ్ నన్ను సంప్రదించినప్పుడు, నేను ఈ సాంగ్ చేయగలనా అని సందేహించాను. ఇది నా కెరీర్‌లో కఠినమైన నిర్ణయాల్లో ఒకటి..” అని ఆమె రాసుకొచ్చారు.
Read more : చిరంజీవి-మౌనీ రాయ్ స్పెషల్ సాంగ్
అయితే, సంజయ్ లీలా భన్సాలీ ఆమెకు ధైర్యం నింపారు. హావభావాల నుంచి డ్యాన్స్ మూమెంట్స్ వరకు ప్రతి అంశంలో ఆయన సలహాలు ఆమెకు స్ఫూర్తినిచ్చాయి. పాటలోని ప్రతి పదం అర్థాన్ని ఆమెకు అర్థమయ్యేలా వివరించారు. ఈ సాంగ్‌ను కొరియోగ్రాఫర్ అద్భుతంగా రూపొందించారని, లంచ్ బ్రేక్‌లలో కూడా డ్యాన్స్ స్టెప్స్ గురించి చర్చించేవారని ప్రియాంక గుర్తు చేసుకున్నారు.
‘రామ్ లీలా’ నుంచి ‘SSMB-29’ వరకు
‘రామ్ లీలా’ చిత్రంలో దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ జంటగా నటించగా, ప్రియాంక స్పెషల్ సాంగ్‌తో అభిమానులను అలరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.
ఇప్పుడు ప్రియాంక తెలుగు సినిమా ‘SSMB-29’తో సూపర్‌స్టార్ మహేష్ బాబుతో జతకట్టబోతున్నారు. ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రియాంక ఈ పోస్ట్‌తో తన బాలీవుడ్ జ్ఞాపకాలను పంచుకుంటూనే, తన రాబోయే ప్రాజెక్ట్‌లతో కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Ram Chahe Leela Song Behind Story :
Read more : ఓజీ ఫస్ట్ సింగిల్


Post a Comment