Disha Patani : హాలీవుడ్‌లోకి దిశా పటానీ గ్రాండ్ ఎంట్రీ

Actress Disha Patani : బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ Disha Patani ఇప్పుడు హాలీవుడ్‌లో అడుగుపెట్టి మరోసారి వార్తల్లో నిలిచింది. ఆమె నటిస్తున్న తొలి హాలీవుడ్ చిత్రం The Portal of Force ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రైలర్‌లో దిశా పటానీ కనిపించిన యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఆమె పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచుతోంది.

Actress Disha Patani

  • యాక్షన్ అవతార్‌తో సెన్సేషన్!
  • ‘ది పోర్టల్ ఆఫ్ ఫోర్స్’ ట్రైలర్‌కు భారీ స్పందన


‘జెసికా’ పాత్రలో దిశా విశ్వరూపం

ఈ అంతర్జాతీయ ప్రాజెక్ట్‌లో దిశా ‘జెసికా’ అనే కీలక పాత్రను పోషిస్తోంది. ట్రైలర్‌లో హై వోల్టేజ్ ఫైట్లు, స్టైలిష్ యాక్షన్ సీన్స్‌లో ఆమె ఎంతో సహజంగా నటించిన తీరు అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటివరకు గ్లామర్ పాత్రలతో అలరించిన దిశా, ఈసారి పూర్తి స్థాయి యాక్షన్ హీరోయిన్‌గా కొత్త అవతార్‌లో కనిపించబోతోంది. దీంతో హాలీవుడ్‌లో కూడా ఆమెకు మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Actress Disha Patani Hollywood Movies

హాలీవుడ్ ఎంట్రీపై దిశా స్పందన


తన తొలి హాలీవుడ్ సినిమా గురించి దిశా పటానీ మాట్లాడుతూ.. “ఈ అంతర్జాతీయ ప్రాజెక్ట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూశాను. మొదటి హాలీవుడ్ మూవీ కావడంతో కొంత భయం ఉన్నా, అదే సమయంలో చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. ప్రపంచ స్థాయి నటీనటులతో కలిసి పని చేయడం గొప్ప అనుభవం. మన దేశంలో నేర్చుకున్న యాక్షన్ నైపుణ్యాన్ని గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌పై చూపించడం నాకు ఎంతో గర్వంగా ఉంది” అని తెలిపింది.


Read more : Love Today Heroine Ivana Latest Gallery

Post a Comment