గోదారి గట్టుపైన’ మూవీ రివ్యూ : గోదారి అందాల మధ్య సాఫ్ట్ ఎమోషనల్ లవ్ స్టోరీ

Godari Gattupaina Movie 2026 Review : షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన కొత్త తరహా దర్శకులు, నటులు తెలుగు సినిమాకు కొత్త ఫీల్ తీసుకొస్తున్నారు. అలాంటి ప్రయత్నాల్లో వచ్చిన చిత్రమే గోదారి గట్టుపైన. సుమంత్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం పూర్తిగా కొత్త కథ కాకపోయినా.. గోదావరి బ్యాక్‌డ్రాప్, ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీతో ప్రేక్షకులను ఒక స్థాయిలో అలరిస్తుంది.

Godari Gattupaina Movie Review

నటీనటులు : సుమంత్ ప్రభాస్-  నిధి ప్రతాప్- జగపతిబాబు- సుదర్శన్- లైలా- దేవి ప్రసాద్- రాజ్ కుమార్ కసిరెడ్డి- హర్షవర్ధన్- రాజీవ్ కనకాల తదితరులు 
సంగీతం : నాగవంశీ 
ఛాయాగ్రహణం : సాయి సంతోష్
 నిర్మాత: అభినవ్ రావు 
రచన-దర్శకత్వం : సుభాష్ చంద్ర 

కథ విషయానికి వస్తే.. ఆటో నడుపుకుంటూ జీవించే రాజు (సుమంత్ ప్రభాస్) తన చెల్లెలి స్నేహితురాలు మాయ (Godari Gattupaina Movie Heroine name ) నిధి ప్రతాప్ ను ప్రేమిస్తాడు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడినా.. మత భేదాలు, కుటుంబ పరిస్థితులు, అమ్మాయి తండ్రి ఆశలు వీరి ప్రేమకు అడ్డంకిగా మారతాయి. ఆ తర్వాత వారి ప్రేమ ఎలాంటి మలుపులు తిరిగింది అన్నదే సినిమా కథ.


ఈ సినిమా ప్రధాన బలం గోదావరి పల్లె వాతావరణం. ఛాయాగ్రాహకుడు సాయి సంతోష్ చూపించిన విజువల్స్ చాలా సహజంగా అనిపిస్తాయి. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలో వచ్చే ప్రేమ సన్నివేశాలు అందంగా కనిపిస్తాయి. దర్శకుడు సుభాష్ చంద్ర కథను చాలా సింపుల్‌గా తీసుకెళ్లినా.. ఎక్కడా అసభ్యత లేకుండా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దాడు.

Godari Gattupaina Movie Online

సుమంత్ ప్రభాస్ నటనలో సహజత్వం కనిపిస్తుంది. గోదారి యాసలో అతని డైలాగ్ డెలివరీ బాగుంది. నిధి ప్రతాప్ కూడా పాత్రకు తగ్గట్టు చక్కగా నటించింది. ఇక సినిమా మొత్తానికి ప్రధాన హైలైట్ సుదర్శన్ కామెడీ అని చెప్పాలి. అతను వచ్చిన ప్రతీ సీన్ థియేటర్లలో నవ్వులు పంచుతుంది. జగపతిబాబు కూడా తండ్రి పాత్రలో హుందాగా కనిపించారు.


అయితే కథ పరంగా పెద్ద కొత్తదనం లేకపోవడం కొంత మైనస్. ప్రేమ ట్రాక్ మరింత బలంగా రాసుంటే సినిమా ఇంకా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేది. కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగిన భావన కలిగించినా.. చివర్లో వచ్చే తండ్రి-కూతురు ఎమోషన్ సినిమాకు మంచి ఫినిషింగ్ ఇస్తుంది.


Godari Gattupaina Movie Heroine Name

మొత్తంగా చూస్తే గోదారి గట్టుపైన ఒక రొటీన్ లవ్ స్టోరీ అయినప్పటికీ.. కామెడీ, గ్రామీణ వాతావరణం, కుటుంబ భావోద్వేగాలతో కాలక్షేపానికి సరిపోయే సినిమా అనిపిస్తుంది.

Godari Gattupaina Movie 2026 Trailer :

                         

రేటింగ్ : 2.75/5 


Read more : Papam Prathap Movie Watch on OTT

Post a Comment