Jailer-2 Telugu Movie Rights : సూపర్ స్టార్ Rajinikanth నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ Jailer సెన్సేషనల్ హిట్ అయిన తర్వాత, దాని సీక్వెల్ ‘జైలర్ 2’పై అంచనాలు భారీగా పెరిగాయి. ప్రముఖ దర్శకుడు Nelson Dilipkumar దర్శకత్వంలో, Sun Pictures భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది.
తెలుగు మార్కెట్‌లో భారీ క్రేజ్
‘జైలర్’ సినిమా 2023లో తెలుగు రాష్ట్రాల్లోనే రూ.70 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ట్రేడ్‌ను షాక్‌కు గురిచేసింది. అదే జోష్‌తో ఇప్పుడు ‘జైలర్ 2’కు ముందే మార్కెట్‌లో భారీ బజ్ క్రియేట్ అయింది. ముఖ్యంగా తెలుగు థియేట్రికల్ రైట్స్ కోసం పెద్ద ఎత్తున పోటీ నెలకొంది.
రైట్స్ ధరపై హాట్ చర్చ
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, సన్ పిక్చర్స్ ‘జైలర్ 2’ తెలుగు డబ్బింగ్ రైట్స్‌ను రూ.60 కోట్లకు పైగా కోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు తెలుగు నిర్మాతలు ఈ రేంజ్‌లోనే ఆఫర్లు ఇచ్చినప్పటికీ, మేకర్స్ మాత్రం తగ్గేదేలే అనే ధోరణితో ఉన్నారని టాక్ వినిపిస్తోంది.
ఎవరు సొంతం చేసుకుంటారు?
ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సీక్వెల్‌పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. చివరకు ఈ భారీ డీల్‌ను ఏ బ్యానర్ దక్కించుకుంటుందో అనేది ఇండస్ట్రీలో ఆసక్తిగా మారింది. ‘జైలర్ 2’ రిలీజ్‌కు ముందే బాక్సాఫీస్ రికార్డులు సెట్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి.
Read more : మలయాళ మూవీ భరతనాట్యం-2 మోహిని యాట్టం ఓటీటీ రిలీజ్

Post a Comment