అక్టోబర్ 17న ‘గరివిడి లక్ష్మి’.. జానపద గాయని జీవితకథతో ఆనంది కొత్త సినిమా

Anandi Garividi Lakshmi Movie Release Date : జానపద గాయని జీవితకథతో ఆనంది కొత్త సినిమా గరివిడి లక్ష్మి రిలీజ్ డేట్ అక్టోబర్ 17, 2026.

Garividi Lakshmi Movie Release Date

లిరిక్స్.కమ్ -తెలుగు సినిమా :  జానపద కళకు, పల్లె సంస్కృతికి అద్దం పట్టే కథలు అరుదుగా తెరకెక్కుతుంటాయి. అలాంటి ఓ ప్రత్యేకమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘గరివిడి లక్ష్మి’. లెజెండరీ జానపద గాయని గరివిడి లక్ష్మి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటి ఆనంది ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.


అక్టోబర్ 17న థియేటర్లలోకి ‘గరివిడి లక్ష్మి’..


పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై రూపొందుతున్న Garividi Lakshmi Movie అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ వీడియో ఆకట్టుకుంటోంది. ‘‘అక్టోబర్ 17న మీ అభిమాన థియేటర్లలో మా గరివిడి లక్ష్మి ఆడి పాడి అలరించబోతోంది’’ అంటూ మేకర్స్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.


జానపద గాయని జీవితాన్ని తెరపైకి..


గరివిడి లక్ష్మి కేవలం పాటలు పాడటమే కాకుండా, తన గానంతో ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చిన కళాకారిణిగా గుర్తింపు పొందారు. ఆమె జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను, జానపద కళతో ఉన్న అనుబంధాన్ని ఈ సినిమా ద్వారా చూపించనున్నారు. మన ఊరి పాటలు, పల్లె అనుభూతులు, మన మూలాల నుంచి వచ్చే ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే చిత్రంగా ‘గరివిడి లక్ష్మి’ రూపొందుతోంది.


భారీ తారాగణంతో సినిమా


గౌరి నాయుడు జమ్ము దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఆనందితో పాటు నరేష్, రాశి, శరణ్య ప్రదీప్, అంకిత్ కొయ్య, రాగ్ మయూర్, మీసాల లక్ష్మణ్, కంచరపాలెం కిషోర్, కుశాలిని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


జానపద గాయని జీవితకథను వెండితెరపై ఎలా ఆవిష్కరించారనేది తెలుసుకోవాలంటే అక్టోబర్ 17 వరకు వేచి చూడాల్సిందే.


Read more : Kaali Teri Gutt Song Lyrics

Post a Comment