Attahasam Movie | ‘అట్టహాసం’తో వెంకటేష్ మహా.. మరోసారి నవ్వించేందుకు రెడీ..

Attahasam Movie : కేరాఫ్ కంచరపాలెం సినిమాతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ‘వెంకటేష్ మహా’ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. 

Attahasam Movie First Look | Attahasam Telugu Movie Download

ఇటీవల ‘రావు బహదూర్’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆయన.. ఇప్పుడు ‘అట్టహాసం’ అనే వినోదాత్మక చిత్రంతో అలరించేందుకు రెడీ అవుతున్నారు.


‘అట్టహాసం’ ఫస్ట్ లుక్ విడుదల..


వెంకటేష్ మహా రచించి, దర్శకత్వం వహించడంతో పాటు ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కూడా కనిపించనున్నారు. తాజాగా అట్టహాసం (Attahasam Telugu Movie) మూవీ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్‌తో పాటు చిత్ర యూనిట్ ఇచ్చిన క్యాప్షన్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

“కంచరపాలెం గడ్డ నుండి మరో కథ వచ్చేసింది.. జీవితం ఊహించని మలుపులతో కూడుకున్నది, కాబట్టి కొన్నిసార్లు మనం చేయగలిగింది ఒక్కటే.. అదే నవ్వడం” అంటూ మేకర్స్ పేర్కొన్నారు. ఈ క్యాప్షన్ చూస్తుంటే సినిమా వినోదంతో పాటు జీవితంలోని విభిన్న కోణాలను చూపించబోతున్నట్లు తెలుస్తోంది.


కీలక పాత్రల్లో కార్తీక్ రత్నం, పావని కరణం

‘అట్టహాసం’ (Attahasam Movie Cast ) చిత్రంలో కార్తీక్ రత్నం, పావని కరణం, స్రవంతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ చక్రాస్ బ్యానర్‌పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వైవిధ్యమైన కథలను ఎంచుకునే వెంకటేష్ మహా నుంచి వస్తున్న మరో చిత్రం కావడంతో ఈ సినిమాపై సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.


సమ్మర్ కానుకగా అట్టహాసం మూవీ

ప్రస్తుతం ‘అట్టహాసం’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

కామెడీ, ఎమోషన్స్‌తో కూడిన ఈ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని చిత్ర బృందం చెబుతోంది. మరి ‘కేరాఫ్ కంచరపాలెం’తో ప్రత్యేక ముద్ర వేసిన వెంకటేష్ మహా.. ‘అట్టహాసం’తో ఎలాంటి అనుభూతిని అందిస్తారో చూడాలి.


Read more : Maremma Movie OTT Streaming

Niharika Konidela Saree Photoshoot

Post a Comment