- మళ్లీ సినిమాల్లోకి పవన్ కల్యాణ్.. పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు.. !
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మళ్లీ వెండితెరపై సందడి చేయబోతున్నారా? అంటే అవుననే టాక్ విన్పిస్తోంది. రాజకీయాల్లో బిజీగా ఉన్న జనసేనాని తిరిగి సినిమాల్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారనే వార్త ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో పవన్ కల్యాణ్ ఓ భారీ పాన్ ఇండియా సినిమాలో నటించనున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ వార్త బయటకు రావడంతో పవర్ స్టార్ అభిమానుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది.
- దిల్ రాజు నిర్మాణంలో భారీ పాన్ ఇండియా మూవీ!..
పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగా పాలనాపరమైన కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ ఆయన మళ్లీ సినిమాల్లో నటించనున్నారనే చర్చ తాజాగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో ఓ ప్రతిష్టాత్మక చిత్రానికి పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ విన్పిస్తోంది.
ఈ భారీప్రాజెక్ట్ కోసం పవన్ కల్యాణ్ ఇప్పటికే దిల్ రాజుకు డేట్స్ కేటాయించినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా పవన్ కల్యాణ్ సినీ కెరీర్‌లో 33వ చిత్రంగా తెరకెక్కనుంది. దీంతో ఈ ప్రాజెక్ట్‌ను అభిమానులు 'పీఎస్‌పీకే 33'గా పేర్కొంటున్నారు.
- దర్శకత్వ బాధ్యతలు ఎవరికి..?
పవన్ కల్యాణ్ 33వ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఎవరికి దక్కుతుందనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ ప్రాజెక్ట్ కోసం టాలీవుడ్‌లో ఇద్దరు ప్రముఖ దర్శకుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో పాటు, వంశీ పైడిపల్లి పేరును కూడా మేకర్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
వీరిద్దరిలో ఎవరు పవన్ కల్యాణ్‌ను డైరెక్ట్ చేస్తారనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఇద్దరు దర్శకుల్లో ఒకరు బాధ్యతలు చేపడితే సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది.
- పవన్ సరసన రుక్మిణి వసంత్, మాళవిక మోహనన్..
ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన నటించే కథానాయికల విషయంలోనూ ఆసక్తికరమైన పేర్లు తెరపైకి వస్తున్నాయి. కన్నడ కస్తూరి రుక్మిణి వసంత్, గ్లామరస్ హీరోయిన్ మాళవిక మోహనన్ పేర్లను చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
వీరిద్దరిలో ఎవరికి అవకాశం దక్కుతుంది? పవన్ కల్యాణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే హీరోయిన్ ఎవరు? అనే ప్రశ్నలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే హీరోయిన్ ఎంపికపై ఇప్పటివరకు అధికారిక సమాచారం అందుబాటులో లేదు.
- 'అర్జున'గా పవన్ కల్యాణ్.. టైటిల్‌పై ఆసక్తికర ప్రచారం!
పవన్ కల్యాణ్ 33వ సినిమాకు 'అర్జున' అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 'అర్జున' అనే టైటిల్ పవన్ కల్యాణ్ ఇమేజ్‌కు సరిపోయేలా ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ టైటిల్ విషయంలోనూ చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
- అధికారిక ప్రకటన కోసం అభిమానుల ఎదురుచూపులు..
దిల్ రాజు నిర్మాణంలో పవన్ కల్యాణ్ హీరోగా భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కనుందనే వార్త టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. దర్శకుడు, హీరోయిన్, టైటిల్ వంటి అంశాలపై ప్రస్తుతానికి వస్తున్నవన్నీ ప్రచార కథనాలే. ఇంకా చిత్ర నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే పవన్ కల్యాణ్ అభిమానులకు ఇది నిజంగానే గుడ్ న్యూస్ కానుంది. రాజకీయ బాధ్యతలను నిర్వహిస్తూనే పవర్ స్టార్ మళ్లీ వెండితెరపై కనిపిస్తారా? 'అర్జున'గా ప్రేక్షకులను అలరిస్తారా? అన్నది తెలియాలంటే మాత్రం మరికొంత కాలం వేచి చూడాల్సిందే..!
Read more : Love Today Pranam Pothunna Song




Post a Comment