Megastar Condition To Keerthy Suresh No Brother : మెగాస్టార్ చిరంజీవి తాజాచిత్రం బోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్లో అట్టహాసంగా జరిగింది. ఈ భారీ ఈవెంట్ కు మెగా అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ ప్రీ రిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి హీరోయిన్ కీర్తి సురేష్ గురించి మాట్లాడిన వార్తలు వైరల్ గా మారాయి.
- కీర్తి సురేష్ కు మెగా కండీషన్.
బోళా శంకర్ మూవీలో చిరంజీవి చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తున్న సంగతి తెల్సిందే. ఈ మూవీలో చిరంజీవి తర్వాత కీలకమైన పాత్ర కీర్తి సురేష్ దే. అన్న చెల్లిలిగా వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలెట్ గా నిలువనున్నాయని స్వయంగా చిరంజీవే వెల్లడించారు. అయితే చిరంజీవి కీర్తి సురేష్ కు షూటింగ్ మొదటి రోజే మెగా కండిషన్ పెట్టడం హాట్ టాపిక్ గా మారింది.
కీర్తి సురేష్-చిరంజీవి కాంబినేషన్లో మొదటి రోజు షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఆయన ఆమెకు ఓ కండిషన్ పెట్టారు. ఈ విషయాన్ని చిరంజీవి ప్రీ రిలీజ్ ఈవెంట్లో తెలియజేశారు. ‘డే వన్నే చెప్పాను.. నో అన్నయ్య ( No Brother ).. నోనో.. ఒకే.. అన్నయ్యలు చాలా మంది ఉన్నారు.. నీకు అక్కర్లేదు.. నువ్వు నా నెక్ట్ పిక్చర్ లో హీరోయిన్ గా ఉంటే చాలు.." అంటూ తనదైన శైలిలో ఫన్నీగా మాట్లాడారు.
- కీర్తి సురేష్ పై మెగా పోయేట్రీ..
బోళాశంకర్లో కీర్తి సురేష్ నటనను చిరంజీవి ప్రశంసించారు. తనతో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉందంటూ ఓ మెగా పోయేట్రీ చెప్పారు..
"ఒక స్వచ్ఛమైన నవ్వు..
ఒక జాబిల్లి లాంటి..
ఒక వెన్నలలాంటి నవ్వు.."
చెప్పాలంటే..
ఈ అమ్మాయితో షూటింగ్ చేస్తున్నప్పుడు
సరదా సరదాగా..
గలగలాపారే నది మీద
పడవ ప్రయాణంలా ఉంటుంది.."
అంటే తనను నేను మిస్ అవుతున్నానని అంటే
నేను తగ్గిపోతున్నానని నా లెవల్ కి నేను అన్లే
పాపం.. తను రెండు మూడుసార్లు అనే సరికి
నేను వస్తానంటే బాగుండు అని చెప్పాను..
ఐ మిస్ యూ డార్లింగ్ అని" కీర్తి సురేష్ తో అన్నారు.
ఏదిఏమైనా మెగాస్టార్ చిరంజీవి తనదైనలోని చిలిపితనాన్ని మరోసారి బోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో బయటపెట్టారు. చిరు పోయేట్రీపై మెగా ఫ్యాన్స్ తోపాటు కీర్తి సురేష్ ఫ్యాన్స్ సైతం పండుగ చేసుకుంటున్నారు. బోళా శంకర్ ప్రీ రిలీజ్ వేడుకలోనే చిరంజీవి తన నెక్ట్ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా ఉండబోతుందని హింట్ ఇవ్వడంపై ఫ్యాన్స్ సైతం ఖుషీ అవుతన్నారు.
#Chiranjeevi says "I Miss You Darling" To #KeerthySuresh#BholaaShankar pic.twitter.com/k60OggyGjz
— Daily Culture (@DailyCultureYT) August 6, 2023
Read more : Bholaa Mania Full Song
Nanne Thitti Pranam Pothunna song
JAGORE JAGO KADILINDHIRA JANASENA
Post a Comment