Maa Nanna Super Hero Movie : సూపర్ స్టార్ మహేష్ బాబు బావ సుధీర్ బాబు నటించిన తాజా చిత్రం ‘మా నాన్న సూపర్’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ తాజాగా విడుదలై యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతోంది.
సుధీర్ బాబు నటించిన ప్రతీ సినిమా భిన్నంగా ఉంటుంది. కొత్త కొత్త కాన్సెప్ట్ లతో సినిమాలను ఎంచుకోవడం ఆయన ప్రత్యేకత. తాజాగా అలాంటి కథనే సుధీర్ బాబు ఎంచుకున్నట్లు ‘మా నాన్న సూపర్’ సినిమాతో నిరూపించాడు. తండ్రి కొడుకుల మధ్య ఉండే ఎమోషన్ తో ఈ మూవీ తెరకెక్కినట్లు టీజర్ ను చూస్తే అర్థమవుతోంది.
అప్పుకింద కొడుకును కదువ పెట్టిన తండ్రి.. తనను పెంచి పెద్ద చేసిన తండ్రి మధ్యలో కొడుకుగా సుధీర్ బాబు కన్పించబోతున్నాడు. పెంచిన తండ్రి.. తనను దూరం చేసుకొని తిరిగి వచ్చిన తండ్రి. వీరిలో ఎవరిని తన తండ్రిగా.. కొడుకు(సుధీర్ బాబు) చివరికి ఎంచుకుంటానేది మాత్రం సినిమా చూడాల్సిందే..!
మా నాన్న సూపర్ హీరోలో డైలాగ్స్..
‘‘ఒకప్పుడు ఈ డబ్బు అవసరమే నా కొడుకును నాకు దూరం చేసింది.. దాని విలువ పాతిక సంవత్సరాలు..’’
‘‘పైసలకోసం కొడుకునే కుదవ పెట్టడు.. ఇన్ని అబద్దాలు చెబుతార్రా పైసల కోసం.. నాన్న కన్న పైసలేం ఎక్కువ కాదు..’’
‘ఎందుకు నాన్న లేనిపోని లెక్కలేసుకొని షేర్స్ లో డబ్బులు పొగొట్టుకోవడం.. నా ఇష్టం రా..’..హహహ
‘‘మీ ఇద్దరికి ఎప్పుడు ఉండేదేలే.. ఎమన్నావ్.. ఇద్దరం కలిసి బాగుంటాం.. అంటున్నా..’’
‘నీ అసలు నాన్న గురించి ఎప్పుడైనా ఆలోచించవారా.. వస్తడేమో ఏదో ఒక రోజు..’’.
‘‘ఈ రోజు చాలా ఆనందంగా ఉంది.. అనుకున్నవన్ని జరిగిపోతున్నాయి.. నేను చూసిన బెస్ట్ ఫాదర్ అండ్ సన్..’’
‘మావాడు 25లో కూడా 20 ఏళ్ళలా ఉంటాడు తెలుసా.. మీ వాడు సూపర్ హీరో.. మేమేదో మాములు మనుషులం..’’
‘‘కళ్ళజోడు పెట్టుకుంటే.. ప్రపంచం ఏమి మారిపోదు.. ప్రేమతో చేసినంత మాత్రానా తప్పు తప్పు కాకుండా పోదు..’’
‘‘నీ వల్ల వచ్చిన దానికంటే పోయిందే ఎక్కువ.. కంటే తండ్రివై పోవు.. తనతో ఉండాలి.. సరిగ్గ పెంచాలి..’’
‘పైసలు మస్తు అవసరం ఉందన్న.. మనం ఏం చేసిన చేస్తాడు.. హేయ్.. నువ్వు తప్పు చేశావ్.. నీకు తెల్సు..’’
‘‘నా కోసం చేస్తే తప్పు.. ఇది నాన్న కోసం.. తప్పదు..’’
‘‘ఇంతకీ నీ పేరేంటీ.. మహేష్ బాబు.. హే వుర్కో.. మహేష్ బాబు అని పేరు పెట్టుకోకూడదా?.. నీకది సూట్ కాలే..’’.
రెండు నిమిషాల 23 సెకండ్ల నిడివితో విడుదైన ‘మా నాన్న సూపర్ హీరో’ టీజర్ మాత్రం అభిమానులను ఆద్యంతం అలరించినట్లే కన్పిస్తోంది. నటుడు సాయి చంద్, సాయాజీ షిండే, ఆర్నా, రాజు సుందరం, శశాంక్, ఆమని, చంద్ర వెంపటి తదితరులు కీలక పాత్రల్లో కన్పించారు.
లోజర్ సిరీస్ డైరెక్టర్ అభిలాష్ కంకర ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా సునీల్ బలుసు ‘V సెల్యులాయిడ్స్, CAM ఎంటర్‌టైన్‌మెంట్ అనుబంధంతో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం జై క్రిష్ సమకూరుస్తున్నాడు. అక్టోబర్ 11న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
మా నాన్న సూపర్ హీరో ట్రైలర్ :
Post a Comment