Ravi Teja Mass Jatara Movie : మాస్ మహారాజా రవితేజ గతేడాది 'మిస్టర్ బచ్చన్'.. 'ఈగల్' వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. కాగా ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద హిట్ సాధించలేక పోయాయి.
![]() |
Ravi Teja Mass Jatara |
ఈ నేపథ్యంలోనే రవితేజ తన తదుపరి సినిమాతో భారీ విజయాన్ని సాధించాలని భావిస్తున్నారు. రవితేజ ప్రస్తుతం భాను బోగవరపు దర్శకత్వంలో 'మాస్ జాతర' అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా ఎంపికైంది.
రవితేజ మాస్ జాతర (Ravi Teja Mass Jatara) నుంచి బిగ్ అప్డేడ్..
జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా 'మాస్ జాతర' చిత్రం నుంచి కొత్త అప్డేట్ రానుందని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ రాబోతున్నాయని తెలుపుతూ రవితేజ పోస్టర్ ను వదిలారు.
ఇందులో రవితేజ భోజనం చేసేందుకు కూర్చొని కోర మీసం మెలేస్తూ కన్పించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ అభిమానుల్లో భారీ అంచనాలు పెంచుతోంది. మాస్ జాతరతో వారికి ఫుల్ మీల్స్ ఖాయమనే టాక్ విన్పిస్తోంది.
Read more : Akhanda-2 Thaandavam Heroine
Post a Comment