Varun Sandesh Constable Movie : వరుణ్ సందేశ్ హీరోగా ఆర్యన్ సుభాన్ దర్శకత్వంలో 'కానిస్టేబుల్' చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకు బలగం జగదీష్ నిర్మాత. మధులిక వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ మూవీ నుంచి ‘‘కానిస్టేబులన్నా.. కానిస్టేబులన్నా.. సమాజమే నీ సేవకు సలాం అంటుందన్న.. కానిస్టేబులన్నా.. కానిస్టేబులన్నా.. ఎగిరే జెండా నిన్నే చూసి మురిసిపోతుందన్నా..’’ అంటూ సాగే టైటిల్ పాటను హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ విడుదల చేశారు.
ఈ పాటకు శ్రీనివాస్ తేజ సాహిత్యం అందించగా.. సుభాష్ ఆనంద్ సంగీతం అందించారు. నల్గొండ గద్దర్ నర్సన్న ఆలపించారు.
పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. కానిస్టేబుల్స్ అంటే తనకు చాలా ఇష్టమన్నారు. వాళ్ల మీద ఈ పాట రావడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు.
వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. ఇది నాకు మంచి కమ్ బ్యాక్ సినిమా అవుతుందనే ఆశాభావిన్ని వ్యక్తం చేశాడు. నటనకు అవకాశం ఉన్న పాత్రని ఇందులో పోషించానని తెలిపారు.
నిర్మాత బలగం జగదీష్ మాట్లాడుతూ.. కానిస్టేబుల్ కావడం తన చిన్ననాటి కోరిక అని తెలిపారు. అది నెరవేరకపోవడంతో ఆ టైటిల్ తోనే ఈ మూవీని తీయడం జరిగిందని వివరించారు.
దర్శకుడు ఆర్యన్ సుభాన్ మాట్లాడుతూ.. మంచి కథ.. కథనాలు.. పాత్రలో వరుణ్ సందేశ్ ఒదిగిపోయిన విధానం సినిమా బాగా రావడానికి దోహదపడిందన్నారు. ఈ టైటిల్ సాంగ్ సందర్భానుసారంగా వస్తుందని ఆయన తెలిపారు.
Hyderabad Commissioner CV Anand launches song for Varun Sandesh New Film “Constable”.
Read more : Ravi Teja Mass Jatara Movie
Post a Comment