Telugu Film Chamber Awards : తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతియేటా చాంబర్ నుంచి ఉత్తమ చిత్రాలు, ప్రతిభ కనబర్చిన నటీనటులకు అవార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
- ఫిబ్రవరి 6న (Telugu Film Chamber Awards) అందించేందుకు నిర్ణయం
తెలుగు సినిమా పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా ఫిబ్రవరి 6న ఇకపై ప్రతీ సంవత్సరం అవార్డులు ఇవ్వాలని సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వాలు ఇచ్చే అవార్డులతోపాటు ఫిల్మ్ చాంబర్ నుంచి కూడా అవార్డులు అందించనున్నట్లు పేర్కొన్నారు.
తెలుగు సినిమా పుట్టిన రోజున ప్రతి సినిమా నటుడు తమ ఇంటిపై.. థియేటర్ల వద్ద ప్రత్యేకంగా జెండా ఆవిష్కరించాలని నిర్ణయించారు. జెండా రూపకల్పన బాధ్యతను దిగ్గజ సినీ రచయిత పరిచూరి గోపాలకృష్ణకు అప్పగించినట్లు తెలుస్తోంది.
Read more : Vishwambhara First Single
Post a Comment