Shabdham Movie : నటుడు ఆది పినిశెట్టి.. దర్శకుడు అరివఝాగన్ కాంబోలో గతంలో 'వైశాలి' మూవీ వచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. హారర్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా 2009లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెల్సిందే.
చాలా ఏళ్ళ తర్వాత మరోసారి ఆది పినిశెట్టి, అరివఝాగన్ కాంబోలో సినిమా రానుంది. అదే జానర్లో 'శబ్దం' మూవీప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. 7జీ ఫిలిమ్, ఆల్ఫా ఫ్రేమ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
- Shabdham Trailer Update
‘శబ్దం’ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్ కు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆత్మల కారణంగా ఎదురయ్యే సంఘటనల చుట్టూ ఈ చిత్రం తిరుగుతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది.
ఈ మూవీలో ఆది పినిశెట్టి ఆత్మల మీద రీసెర్చ్ చేసే పాత్రలో కనిపించబోతున్నాడు.‘వైశాలి’ సినిమాను మించి హిట్ కొట్టాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈమేరకు చిత్రయూనిట్ 'శబ్దం' నుంచి తాజాగా ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు.
‘‘పులకరింతల సౌండ్ ఎక్కువవు తోంది..! గట్టిగా పట్టుకోండి..! శబ్దం ట్రైలర్ ఫిబ్రవరి 19న రానుంది.. సౌండ్ థ్రిల్లర్ కోసం సిద్ధంగా ఉండండి..’’ అంటూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇదికాస్తా నెట్టింట వైరల్ గా మారింది.
శబ్దం మూవీ (Shabdham Release Date) ఫిబ్రవరి 28న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ సన్నహాలు చేస్తున్నారు.
Shabdham Trailer Out Now :
Read more : Rama Raghavam 2025 : డీజే ఫర్ పీజే
Sabdham Movie Review Telugu | Sabdham Review | Sabdham Telugu Review | Sabdham Movie Review.
Post a Comment