Kriti Shetty : యంగ్ హీరోయిన్ కృతిశెట్టి ‘ఉప్పెన' మూవీతో టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్లు దక్కించుకొని బిజీగా మారిపోయింది. అయితే ఆ తర్వాత వచ్చిన ఏ మూవీ కూడా ఉప్పెన రేంజ్ లో హిట్ కాక పోవడంతో ఆమెకు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి.
ఈ నేపథ్యంలోనే Tollywood కి బ్రేక్ ఇచ్చి.. కోలీవుడ్ చెక్కేసింది ఈ భామ. ప్రస్తుతం అక్కడ వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. అయితే తాజాగా మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు కృతిశెట్టి సిద్ధమవుతున్నట్లు కన్పిస్తోంది.
- విశ్వక్ సేన కు జోడిగా Kriti Shetty
డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఓ సినిమా రానుంది. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానుందని టాక్.
కాగా విశ్వక్ సేన్ తాజాగా లైలా-2025 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్ డ్ టాక్ వస్తోంది. మరోవైపు కృతిశెట్టి గతేడాది 'మనమే' సినిమాతో అలరించింది. ఈ మూవీ తర్వాత కృతిశెట్టి నుంచి తెలుగులో మరో మూవీ ప్రకటన రాలేదు.
Read more : Daaku Maharaaj OTT
Post a Comment