Mangalavaram 2 : బోల్డ్ హీరోయిన్ పాయల్ రాజ్ ఫుత్ లీడ్ రోల్ లో నటించిన మూవీ 'మంగళవారం'. సెక్సువల్ డిజార్డర్ కథాంశంతో అజయ్ భూపతి తెరకెక్కించారు. ఈ మూవీలో నందిత శ్వేత, అజయ్ ఘోష్, దివ్యా పిళ్లై తదితరులు ముఖ్య పాత్రల్లో నటించి మెప్పించారు.
ఈ మూవీలో పాయల్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అంతేకాకుండా 'మంగళవారం'తో భారీ హిట్టు తన ఖాతాలో వేసుకుంది. 2023లో చిన్న సినిమాగా వచ్చిన Mangalavaram సినిమా ఘన విజయాన్ని సాధించింది.
ఈక్రమంలోనే మంగళవారం సినిమాకు సీక్వెల్ తెరకెక్కించేందుకు డైరెక్టర్ అజయ్ భూపతి పడ్డారు సన్నహాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బజ్ ప్రకారం 'మంగళవారం' మూవీకి సంబంధించి స్క్రిప్ట్ కూడా లాక్ అయిందట.
త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని టాలీవుడ్ వర్గాల సమాచారం. పూర్తి క్యాస్టింగ్ వివరాలన్నీ అధికారికంగా వెల్లడించే అవకాశముంది. ఈ సినిమాలో ఊహించని ట్విస్ట్ ఏంటంటే ఈ సీక్వెల్ మూవీలో పాయల్ స్థానంలో మరో కొత్త హీరోయిన్ నటించొచ్చని టాక్ విన్పిస్తోంది.
మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. అనౌన్స్మెంట్ వచ్చేవరకు వేచి చూడాల్సి ఉంది.
Read more : Vishwambhara First Single
Post a Comment