Naga Chaitanya Upcoming Movies : అక్కినేని నాగచైతన్య 'తండేల్'తో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీ చైతన్య కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టింది.
చందూ మొడేటి దర్శకత్వం వహించగా వాలంటైన్స్ డే సంబరాల్లో భాగంగా ఫిబ్రవరి 7న గ్రాండ్ రిలీజైంది. థియేటర్లో ఇంకా సందడి చేస్తూనే ఉంది.
ఈ మూవీతో నాగ చైతన్య గ్రాఫ్ కొద్దిగా పెరిగింది. దీంతో చైతూ తన తదుపరి మూవీ ఎలాంటి మూవీస్ చేస్తాడో అని క్యూరియాసిటీ నెలకొంది.
తాజాగా చైతు సినిమాలకు సంబంధించి ఓ ఆసక్తికరమైన న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. నాగచైతన్య ప్రస్తుతం మూడు భారీ ప్రాజెక్టులను లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది.
- నాగచైతన్య (Naga Chaitanya) వరుస ప్రాజెక్టులు..
'తండేల్' సక్సెస్ మీట్లో చైతూ మాట్లాడుతూ.. మరోసారి నాగచైతన్య, చందూ మొండేటి కాంబో రిపీట్ కాబోతున్నట్లు చెప్పాడు. అలాగే త్వరలో ఒక గొప్ప హిస్టారికల్ మూవీ చేయబోతున్నాడట.
అక్కినేని నాగేశ్వరరావు చేసిన తెనాలి రామకృష్ణకు నేటి ప్రేక్షకులను అర్థమయ్యేలా మేకోవర్ చేసి సినిమా తీయనున్నట్లు వెల్లడించారు.
విరుపాక్ష” డైరెక్టర్ కార్తీక్ వర్మ దండుతో మిస్టరీ థ్రిల్లర్ చిత్రం చేయనున్నాడట.. 'బాహు బలి', 'బాహుబలి-2' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన ఆర్కా మీడియా వర్క్స్ కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు టాక్ విన్పిస్తోంది.
హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి డైరెక్టర్ ఎవరనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ఏదిఏమైనా చైతూ వరుసగా భారీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రానుండటతో అక్కినేని ఫ్యాన్స్ సైతం ఖుషీ అవుతున్నారు.
Read more : Vishwambhara First Single
Post a Comment