Tripti Dimri : పర్వీన్ బాబీ బయోపిక్ లో త్రిప్తి దిమ్రి

Tripti Dimri in Parveen Babi Biopic : బాలీవుడ్ హాట్ బ్యూటీ త్రిప్తి దిమ్రి 'యానిమల్' మూవీతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన సంగతి తెల్సిందే. తన అందంతో యూత్ అటెన్షన్ తన వైపు తిప్పుకుని నేషనల్ క్రష్ గా మారిపోయింది.

Tripti Dimri in Parveen Babi

ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్లో వరుస సినిమాలకు సైన్ చేస్తోంది. ఇటీవలే 'బ్యాడ్ న్యూజ్' సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజా ఓ స్టార్ నటి బయోగ్రఫీలో నటించేందుకు సిద్ధం అవుతోంది.


అలనాటి బాలీవుడ్ మేటి నటి పర్వీన్ బాబీ జీవిత కథ వెబ్ సీరీస్ గా రానుంది. పర్వీన్ బాబీ పాత్రలో త్రిప్తి దిమ్రి నటించనుండగా.. షోనాలీ బోస్ దర్శకత్వం వహించనున్నారు. ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ స్టీమింగ్ కానుంది. అయితే స్ట్రీమింగ్ తేది అధికారికంగా ఖరారు కాలేదు. 


70వ దశకంలో స్టార్ హీరోయిన్ గా (Parveen Babi) క్రేజ్..

పర్వీన్ బాబీ విషయానికి వస్తే.. 70-80 దశకంలో బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా స్పెషల్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. తన అందం.. అద్భుతమైన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. 

Parveen Babi and Tripti Dimri

నాటి యువతకు కలల రాణిగా ఉండేది. మరోవైపు వ్యక్తిగత జీవితంలో అనేక సమస్యలు, ఒడిదుడుకులు ఎదుర్కొంది. పర్వీన్ బాబీ 2005లో తుదిశ్వాస విడిచారు.  ఆమె బయోపిక్ ఇప్పుడు రానుండటంతో అందరిలోనూ ఒకింత ఆసక్తి నెలకొంది. 


పర్వీన్ బాబీ పాత్రలో నటిస్తున్న త్రిప్తి దిమ్రి సైతం ఈ సినిమా కోసం ఆమె నటించిన సినిమాలను చూస్తుందని డైరెక్టర్ షోనాలీ బోస్ తెలిపారు. ఈ వెబ్ సిరీస్ కోసం అభిమానులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 


Read more : Vishwambhara First Single

Post a Comment