Sameera Reddy : అప్పుడు వద్దన్నారు.. ఇప్పుడు క్యూ కడుతున్నారు

Actress Sameera Reddy : బాలీవుడ్ కన్నా సౌత్ ఇండస్ట్రీ టెక్నాలజీ, యాక్షన్ పరంగా ఎప్పుడూ ముందుంటుందని ప్రముఖ నటి Sameera Reddy ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి, ఎన్టీఆర్, సూర్య, అజిత్, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలతో పని చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆమె తెలిపారు. తన టీమ్ వద్దు అని చెప్పినా, దక్షిణాది సినిమాల్లో నటించే అవకాశాన్ని ఎప్పుడూ వదులుకోలేదని పేర్కొన్నారు.

Sameera Reddy Latest Photos


  • సమీరా రెడ్డి కామెంట్స్ వైరల్.. సౌత్ ఇండస్ట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు
  • సౌత్ సినిమాలపై సమీరా రెడ్డి ప్రశంసలు


సౌత్ సినిమాల వల్ల తన కుటుంబానికి కూడా గర్వకారణంగా మారానని సమీరా చెప్పారు. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కూడా సౌత్ సినిమాల్లో అవకాశాల కోసం ఆసక్తి చూపుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Sameera Reddy Surya

- సౌత్ డైరెక్టర్లపై సమీరా ప్రశంసలు


దక్షిణాది దర్శకులు కొత్త ప్రయోగాలు చేయడానికి వెనుకాడరని సమీరా రెడ్డి అభిప్రాయపడ్డారు. రిస్క్ తీసుకుని కొత్త కథలు, భారీ యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారని చెప్పారు. అయితే హిందీ మేకర్స్ మాత్రం ఎక్కువగా సేఫ్ జోన్‌లో ఉండటానికే ప్రయత్నిస్తారని ఆమె వెల్లడించారు.

Sameera  Reddy Surya

- 10 ఏళ్ల తర్వాత సమీరా సెకండ్ ఇన్నింగ్స్


దాదాపు పదేళ్ల విరామం తర్వాత సమీరా రెడ్డి మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. Sanjay Dutt నటిస్తున్న ‘ఆఖరి సవాల్’ సినిమాతో ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు. అయితే ఇది కమ్‌బ్యాక్ కాదని, కేవలం చిన్న విరామం మాత్రమే తీసుకున్నానని సమీరా స్పష్టం చేశారు. మరోసారి ఆమెను సిల్వర్ స్క్రీన్‌పై చూడబోతుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.


Read more : Godari Gattupaina Movie 2026 Review

Post a Comment