Actress Shivani Nagaram : టాలీవుడ్‌లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న శివాని నాగరం ప్రస్తుతం వరుస అవకాశాలతో ఫుల్ బిజీగా మారింది. ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’, ‘లిటిల్ హార్ట్స్’ వంటి సినిమాలతో మంచి విజయాలు అందుకుని ఇండస్ట్రీలో లక్కీ చార్మ్‌గా పేరు తెచ్చుకుంది. తన నటనతో పాటు నేచురల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీకి ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమ నుంచి కూడా అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.
- మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన శివాని నాగారం
- వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న టాలీవుడ్ బ్యూటీ
తమిళ ఇండస్ట్రీలో కొత్త ప్రయాణం
తాజా సమాచారం ప్రకారం శివాని నాగరం త్వరలో కోలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోందని తెలుస్తోంది. ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు అభిషన్ జీవింత్ హీరోగా నటిస్తున్న కొత్త ప్రాజెక్ట్‌లో శివాని హీరోయిన్‌గా ఎంపికైనట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే తెలుగులో రెండు హిట్స్ అందుకున్న శివాని.. ఇప్పుడు తమిళ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది.
డెబ్యూటెంట్ డైరెక్టర్‌తో క్రేజీ మూవీ
‘విత్ లవ్’ సినిమాతో హీరోగా విజయాన్ని అందుకున్న అభిషన్ జీవింత్ ప్రస్తుతం తన రెండో ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టారు. ఈ సినిమాకు డెబ్యూటెంట్ దర్శకుడు గౌతమ్ శివరామన్ దర్శకత్వం వహించనున్నారు. ఇదే ప్రాజెక్ట్‌లో యోగలక్షి మరో కీలక పాత్రలో కనిపించనుందని సమాచారం. ఈ క్రేజీ కాంబినేషన్‌పై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
Read more : బాలీవుడ్‌పై సిమ్రాన్ సంచలన వ్యాఖ్యలు



Post a Comment