- “సౌత్ నటులకు కనీస గౌరవం లేదు”
- బాలీవుడ్ తీరుపై సీనియర్ హీరోయిన్ ఆవేదన
“కొత్త వాళ్లలా చూస్తారు”
సిమ్రాన్ మాట్లాడుతూ.. “నాకు చాలా సార్లు హిందీ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ అక్కడ సరైన కమ్యూనికేషన్ ఉండదు. సౌత్‌లో మేము సంపాదించుకున్న పేరు, గౌరవం, లెగసీని అసలు గుర్తించరు. మమ్మల్ని కొత్తగా వచ్చిన నటుల్లా చూస్తారు. ఇది చాలా బాధ కలిగించే విషయం” అని పేర్కొన్నారు.
వసతి సౌకర్యాల విషయంలోనూ వివక్ష
బాలీవుడ్ నిర్మాతల వ్యవహార శైలిపై కూడా ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. హోటల్ గదులు, విమాన టిక్కెట్లు, వెంట వచ్చే స్టాఫ్ విషయంలో బేరసారాలు చేస్తారని తెలిపారు. “ఇవి చిన్న విషయాల్లా కనిపించవచ్చు. కానీ దశాబ్దాలుగా సినిమా కోసం కష్టపడిన మాలాంటి సీనియర్ నటులకు ఇవి అవమానంగా అనిపిస్తాయి” అని సిమ్రాన్ ఆవేదన వ్యక్తం చేశారు.
సౌత్ నటులకు గౌరవం కావాలి
ప్రస్తుతం సౌత్ సినిమాలు దేశవ్యాప్తంగా భారీ విజయాలు సాధిస్తున్న వేళ.. సిమ్రాన్ చేసిన ఈ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సౌత్ నటులకు బాలీవుడ్‌లో సరైన గౌరవం, గుర్తింపు దక్కాలనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.
Read more : గోదారి గట్టుపైన మూవీ రివ్యూ


Post a Comment