Allu Arjun Jahnvi Kapoor Movies : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు జోడిగా అతిలోక సుందరి స్వర్గీయ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించనుందనే టాక్ విన్పిస్తోంది.
‘పుష్ప-2’తో అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. హిందీలో ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబట్టడంతో బాలీవుడ్లోనూ అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగింది.
జాన్వీ కపూర్ తెలుగులో ‘దేవర’ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న ఆర్సీ-16 మూవీలో నటిస్తోంది. ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
- Allu Arjun Jahnvi Kapoor First Movie..
ఈ సినిమాలో నటించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అల్లు అర్జున్, జాన్వీ కపూర్ కాంబోపై ప్రేక్షకుల్లో క్యూరిసిటీ నెలకొంది. ఈ కాంబినేషన్ సెట్ అయితే సినిమా సూపర్ హిట్ అవుతుందనే కామెంట్స్ విన్పిస్తున్నాయి.
Read more : Kriti Shetty : ‘లైలా’కు జోడిగా కృతిశెట్టి
Post a Comment