Chiranjeevi Mega Mass Masala : తెలుగు సినిమా పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి ఒక బ్రాండ్. ఆయన నటన, శైలి, డైలాగ్ డెలివరీ అభిమానులను ఎప్పటికీ ఆకట్టుకుంటాయి. ఇప్పుడు ఆయన బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేతులు కలిపారు. ఈ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం తెలుగు సినీ అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది.
ఈ సినిమాలో నయనతార మొయిన్ హీరోయిన్‌గా, క్యాతరినా థ్రెసా సెకండ్ హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
అనిల్ రావిపూడి తన కామెడీ టైమింగ్, కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్‌తో కూడిన ఎంటర్‌టైనర్‌లతో ప్రేక్షకులను అలరించడంలో సిద్ధహస్తుడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ‘ఎఫ్-2’, ‘ఎఫ్-3’.. ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి చిత్రాలతో తన సత్తా చాటారు.
చిరంజీవితో ఆయన చేయబోతున్న ఈ చిత్రం పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. చిరంజీవి గతంలో ‘చంటబ్బాయ్’.. ‘మెకానిక్ అల్లుడు’ వంటి కామెడీ చిత్రాల్లో తన నటనతో అలరించిన సంగతి తెల్సిందే. ఈ తరహా కామెడీ టైమింగ్‌ను అనిల్ రావిపూడి పూర్తిగా వినియోగించుకోనున్నారు.
- చిరు-నయన్ కాంబో.. (Chiranjeevi Nayana Tara)..
ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది. నయనతార, చిరంజీవితో గతంలో ‘సైరా’.. ‘గాడ్ ఫాదర్’ చిత్రాల్లో నటించారు. ఈ రెండు చిత్రాల్లో వీరి జోడీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ కలిసి నటించబోతుండటం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.
నయనతార తన నటన, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఈ చిత్రంలోనూ మెప్పించనుందని టాక్. ఈ చిత్రం కోసం ఆమె భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే నిర్మాతలు దీనికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
- చిరంజీవి సరసన క్యాతరినా.. (Chiranjeevi Catherine Tresa)..
ఇక క్యాతరినా థ్రెసా కీలక పాత్రలో కనిపించనుంది. తెలుగు, తమిళ చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకున్న క్యాతరినా, ఈ చిత్రంలో చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆమె కెరీర్‌కు ఒక మైలురాయిగా నిలవనుంది. ఆమె పాత్ర గురించి ఇంకా పూర్తి వివరాలు బయటకు రాలేదు, కానీ ఈ చిత్రంలో ఆమెది ముఖ్యమైన పాత్ర అని తెలుస్తోంది.
చిరంజీవి, రవితేజ కాంబోనేషన్లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో క్యాతరినా థ్రెసా నటించారు. ఇందులో రవితేజకు జోడిగా కన్పించారు. ఈ సినిమాలో టాలీవుడ్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
అనిల్ రావిపూడి మరియు చిరంజీవి చిత్రం తాత్కాలికంగా ‘మెగా 157’గా పిలువబడుతోంది. షూటింగ్ 2025 మే నుంచి ప్రారంభం కానుంది. కేవలం 90 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఇది తెలుగు సినిమా చరిత్రలో వేగంగా తెరకెక్కే చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది.
సాహు గరపాటి, చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్‌తో ఈ చిత్రం సాంకేతికంగా బలంగా కన్పిస్తుంది.
ఈ సినిమాను సంక్రాంతి 2026లో జనవరి 10 లేదా 12న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. చిరంజీవి కామెడీ అవతార్, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్, నయనతార, క్యాతరినా థ్రెసా లాంటి తారాగణంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
Read more : Anushka Shetty Ghaati
Post a Comment