Kingdom Heroine Bhagyashri Borse Telugu Dubbing : టాలీవుడ్‌లో ఇప్పుడు అందరి చూపు ‘కింగ్‌డమ్’ సినిమాపైనే. విజయ్ దేవరకొండ హీరోగా.. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ విడుదలకు ముందే భారీ హైప్ సొంతం చేసుకుంది.
కింగ్డమ్ మూవీకి సంబంధించిన టీజర్, పాటలు, ఆకర్షణీయమైన ప్రమోషన్‌లతో సినిమా అంచనాలను పెంచేసింది. ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న భాగ్యశ్రీ బోర్సే, తన పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతోంది.
చిత్ర బృందం ప్రమోషన్ ఊపందుకునేలా ప్లాన్ చేస్తోంది. అయితే అందరి దృష్టిని ఆకర్షించింది భాగ్యశ్రీ బోర్సే చేసిన ఓ స్పెషల్ పని. అదేంటంటే తన పాత్రకు తానే స్వయంగా తెలుగులో డబ్బింగ్ చెప్పడం. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా అభిమానులతో పంచుకోవడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
Read more : Vijay Deverakonda & Samantha Dance Video
భాగ్యశ్రీ బోర్సే.. తెలుగు డబ్బింగ్ సంచలనం.. అభిమానులు ఫిదా..
కొత్త హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భాగ్యశ్రీ, తన డెడికేషన్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా చాలా మంది హీరోయిన్లు భాషా సమస్యల కారణంగా డబ్బింగ్ ఆర్టిస్టుల సాయం తీసుకుంటారు. కానీ, భాగ్యశ్రీ మాత్రం పూర్తి తెలుగు డైలాగ్స్‌ను స్వయంగా డబ్ చేసి, తన పాత్రకు ప్రాణం పోసింది.
ఈ నిర్ణయం ఆమె పట్ల సినీ వర్గాల్లో ప్రశంసల వర్షం కురిపించింది. నటనలోనే కాదు, డైలాగ్ డెలివరీలో ఎమోషన్‌ను ఖచ్చితంగా ప్రెజెంట్ చేసిన ఆమె, తెలుగు భాషకు తగ్గట్టుగా సహజంగా డబ్ చేసినట్లు తెలుస్తోంది.
“డబ్బింగ్ అనేది కేవలం డైలాగ్స్ చెప్పడం కాదు.. ప్రతి మాటలో భావం పలికించడం ముఖ్యం. తెలుగులో నేనే స్వయంగా డబ్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ ప్రక్రియలో నా పాత్రలో జీవం పోసే అవకాశం దొరికింది..” అని భాగ్యశ్రీ చెప్పిన మాటలు తెలుగు పట్ల అభిమానాన్ని స్పష్టం చేస్తున్నాయి.
- Vijay Deverakonda Speech at Kingdom Trailer Launch Event | Anirudh | Gowtam Tinnanuri | S Naga Vamsi
ఈ డెడికేషన్ ‘కింగ్‌డమ్’పై అంచనాలను మరింత పెంచేసింది. ప్రేక్షకులు ఆమె నటనతో పాటు ఆమె స్వరాన్ని వినేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నార్త్ ఇండియన్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగుపెట్టి, తెలుగు భాషకు ఇంత ప్రాధాన్యత ఇవ్వడం అభిమానుల హృదయాలను గెలుచుకుంది.
దీంతో ఈ సినిమా విడుదల తర్వాత భాగ్యశ్రీకి టాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు దక్కే అవకాశం ఉందని ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చ నడుస్తోంది. ‘కింగ్‌డమ్’లో ఆమె ప్రదర్శన ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలంటే సినిమా విడుదల రోజు(జూలై 31) వరకూ ఆగక తప్పదు.
Read more : కృతి శెట్టి : తమిళ సినిమాలతో టాలీవుడ్‌లో రీఎంట్రీ కోసం ప్లాన్
- Bhagyashrii Borse Speech at Kingdom Trailer Launch Event | Vijay Deverakonda | Anirudh | Gowtam T
Post a Comment